బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా ర్యాలీ చేశారని అభియోగం మోపారు. అయితే నిన్న (గురువారం) ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. బయటికొచ్చిన తర్వాత ర్యాలీతో తెలంగాణ భవన్ కు వచ్చారు. అయితే అనధికారికంగా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
చంద్రబాబు పై మరో కేసు నమోదు అయింది.. ఉచిత ఇసుక విధానం పేరిట గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు.