రేపు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి క్యాబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47 వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Rohit Sharma Retirement: రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ అంతంత మాత్రమే.. గణాంకాలు ఇవే!
తల్లికి వందనం, అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై గురువారం క్యాబినెట్‌లో చర్చ జరగనుంది. ప్రధాని మోడీ సభ విజయవంతంపై సీఎం చంద్రబాబు మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. క్యాబినెట్‌లో తీర ప్రాంత భద్రతపై ప్రత్యేక చర్చ జరగనుంది.