Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Cabinet Meeting Today Key Agenda On Amaravati Development Funds Approval Land Allocation

AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండా..

Published Date :April 30, 2026 , 7:37 am
By Sudhakar Ravula
AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Cabinet Meeting Today: ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ముందు నేడు కీలక అజెండా ఉంది.. అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ. 1208.41 కోట్లు వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి సచివాలయం, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో ఫసాడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు రూ. 2540 కోట్లు వ్యయం చేయడానికి అనుమతి ఇవ్వనుంది. ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు రూ. 798 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ ప్రతిపాదనలకు కూడా మంత్రి మండలి మంజూరు ఇవ్వనుంది.

Read Also: Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన

Also Read

  • AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేయండి..
  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..

ఎల్పీఎస్ జోన్-11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఆమోదం ఇవ్వనుంది. రాజధానిలో 220 కేవీ లైన్ల రీరూటింగ్‌కు కూడా అనుమతి ఇవ్వనుంది కేబినెట్‌.. రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. మెట్ట భూములకు ఎకరాకు రూ. 40,000, జరీబు భూములకు రూ. 60,000 చొప్పున కౌలు పెంపుకు అనుమతి ఇవ్వనుంది. అలాగే ప్రతి ఏడాది మెట్ట భూములకు రూ. 3,000, జరీబు భూములకు రూ. 5,000 చొప్పున పదేళ్ల పాటు పెంచేందుకు కూడా ఆమోదం తెలపనుంది.

రాజధానిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు సీఆర్డీఏ అథారిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వాటిని కేబినెట్‌లో ఖరారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 1.78 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలపనుంది. స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం వేర్వేరు ప్రాంతాల్లో 4.23 ఎకరాల భూమిని కేటాయించనుంది. అగ్నిమాపక శాఖకు రాజధానిలో రాయపూడి వద్ద 2 ఎకరాల స్థలం కేటాయింపుకు అనుమతి ఇవ్వనుంది. డీఏవీ పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలపనుంది. ఆప్కాబ్‌కు రాయపూడి వద్ద 0.49 ఎకరాల భూమిని కేటాయించనుంది.

“బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేబినెట్ అభినందనలు తెలియజేయనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అజెండా ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో డీజిల్ సమస్యపై కూడా చర్చించే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati development projects
  • Andhra Pradesh Cabinet Agenda
  • AP Cabinet Meeting 2026
  • AP government decisions
  • AP infrastructure projects

తాజావార్తలు

  • Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!

  • IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • Muskmelon Health Risks: కర్బూజా కొనుగోలు చేసే ముందు.. తినకూడని వారు ఎవరు? ముఖ్య జాగ్రత్తలు

  • Heinrich Klaasen: ఇక ‘డాడీ డ్యూటీ’ మొదలవుతుంది.. ఎస్‌ఆర్‌హెచ్‌ హీరో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేయండి..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions