NTV Telugu Site icon

AP Cabinet: సమీకృత పర్యాటక పాలసీకి ఆమోదం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణాన్ని కేబినెట్ ఆమోదించింది. గత ఐదేళ్లలో అసలు నిర్మించని గృహాలను రద్దు చేసే అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది.

Read Also: Question Paper Leak: పరీక్షకు ముందే క్వశ్చన్‌ పేపర్‌ వాట్సాప్‌లో హల్చల్

ఏపీ ఆయుర్వేద, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. డిసెంబర్ 15 న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినం నిర్వహించేందుకు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ పాలసీ 4.0 కి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్‌టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు ఆమోదం లభించింది. ఏపీ సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

Show comments