AP BJP: ఏపీ బీజేపీలో కలవరం.. ఇంకా ఫైనల్ కానీ అభ్యర్థుల జాబితా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ బీజేపీలో కలవరం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు పలువురు ముఖ్య నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక, ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షమైన టీడీపీ ఇప్పటికే మూడు విడతల్లో 139 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. జనసేన సైతం విడతల వారీగా 17 అసెంబ్లీ, కాకినాడ లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల పేర్లను తెలియజేసింది. అయితే, ఇప్పటి వరకు బీజేపీ 4 విడతలుగా ప్రకటించిన జాబితాలో ఏపీ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Read Also: Weather Department: నేటి నుంచి దంచికొట్టనున్న ఎండలు.. 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
కానీ, ఏపీలో అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ జాప్యం చేస్తుంది. 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక, బీజేపీలో టికెట్ ఆశిస్తోన్న అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కుదరక ముందే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల నుంచి కమలం పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. అలాగే, ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురిని ఎంపిక చేసిన కాషాయం పార్టీ.. ఇప్పుడు అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోలేకపోతున్నారు. ఇవాళ్టి బీజేపీ అభ్యర్థులెవరో వెల్లడి కాకపోతే ఎలాగని బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి తర్వాత ప్రతి నిమిషం విలువైందన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ముఖ్యనేతలు ఏమీ చెప్పకుండా రోజుల తరబడి జాప్యం చేస్తుండటంతో పార్టీ కేడర్ సహనం కోల్పోతున్నారు. అయితే, పొత్తుల్లో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు సమాచారం. కూటమి పార్టీ నేతల్లో వినిపిస్తున్న వివరాల ప్రకారం రాయలసీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 సీట్లలో బీజేపీ బరిలో దిగబోతుంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!