Purandeswari: కేంద్రమిచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: దొంగ ఓట్లతో గెలవాలని జగన్ కుట్రలు చేస్తున్నారని.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. బీజేపీ సోషల్ మీడియా విభాగంతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై పురంధేశ్వరి దిశా నిర్దేశం చేశారు. ఎపిక్ కార్డులు కూడా మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు సృష్టించారని.. దొంగ ఓట్లు ఆధారంగానే జగన్ వైనాట్ 175 స్లోగన్ ఇచ్చారని ఆమె విమర్శించారు. దొంగ ఓట్లు విషయంలో ఐఏఎస్ అధికారి సస్పెన్షన్ చేయడం బీజేపీ విజయమని పేర్కొన్నారు.
Read Also: Chandrababu: చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు పూర్తిగా దూరం పెట్టాలని.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశామన్నారు. ఓటు మార్చుకునే అవకాశాన్ని కూడా వైసీపీ నేతలు దుర్వినియోగం చేశారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధానాన్ని కూడా బీజేపీ ఆక్షేపిస్తుందన్నారు. పురంధేశ్వరి మాట్లాడుతూ.. “ఓటర్లను భయపెట్టి, ప్రలోభ పెట్టే వారిపై దృష్టి పెడుతున్నాం.మోడీ చేసిన మంచి, జగన్ చేసిన మోసాలు ప్రజలకు వివరించండి.మోడీ అమలు చేసే పధకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎన్నికలకు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేసుకోవాలి. 23 జిల్లాల్లో పర్యటించి అక్కడ పార్టీ నేతలపై సమీక్ష చేశా. ఉపాధి హామీ పధకం కింద ఇచ్చే డబ్బు కేంద్రానిదే. అభివృద్ధి కోసం కేంద్రమిచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. సంక్షేమ పధకాల్లో లబ్ధిదారులను జగన్ ప్రభుత్వం తగ్గించేస్తుంది. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని.. తమ బియ్యంగా జగన్ వాహనాలు ద్వారా పంపిణీ చేస్తున్నారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదల కోసం మోడీ ఉచిత బియ్యం ఇచ్చారు. గ్రామాల్లో నిద్రలు చేస్తూ.. అక్కడి ప్రజలకు బీజేపీ చేసిన మంచిని వివరించాలి.” అని పురంధేశ్వరి బీజేపీ సోషల్ మీడియా ప్రతినిధులకు సూచించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!