ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు అలెర్ట్. ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read: Godavari Delta: 3 ప్రధాన కాలువలకు సాగునీటి సరఫరా నిలిపివేత.. మళ్లీ జూన్ ఒకటి నుంచి నీరు విడుదల!
విద్యార్థులు పదో తరగతి ఫలితాలను https://bse.ap.gov.in https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా పొందొచ్చు. మన మిత్ర వాట్సప్ యాప్, లీప్ మొబైల్ యాప్‌లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి.. విద్యా సేవలను సెలెక్ట్ చేసి, ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. ఆపై రోల్ నంబరు ఎంటర్ చేస్తే.. ఫలితాలు పీడీఎఫ్ రూపంలో వస్తాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ లాగిన్ ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లీప్ యాప్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రత్యేక లాగిన్‌లు ఉన్నాయి.