Anvesh Reddy : రైతులను ఆడుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బచేసే కుట్ర చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, అసలు సన్నాలు, దొడ్డు ఓట్లు ఎంత రైతులు పండిస్తారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. సన్నలు ఈ ఏడాది 14 లక్షల ఎకరాలు, 32 లక్షల దొడ్డు ఒడ్లు పండిస్తున్నారని, రైతులను ఆడుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉందన్నారు అన్వేష్ రెడ్డి. సన్నలకు, దొడ్డు వడ్లకు కేంద్రం ఓకే ధర ఇస్తుందని, సన్నలకు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మిల్లర్లు అదనపు ధర తో కొనుగోలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూడా జనగామ ఎన్నికల ప్రచారంలో సన్నలకు 150 బోనస్ ఇస్తాం అని అన్నారని, బాయిల్డ్ రైస్ మాత్రమే కేంద్రం తీసుకుంటున్నది.. దొడ్డు వడ్లు మాత్రమే బయిల్డ్ రైస్ వస్తుందన్నారు. 24 లక్షల మెట్రిక్ టన్నులు ఏడాదికి రేషన్ బియ్యం ప్రజలకు అందిస్తున్నామని, ఆ రేషన్ బియ్యం మిల్లర్ల వద్ద రీసైక్లింగ్ అవుతుందన్నారు.
అంతేకాకుండా..’PDS ద్వారా సన్నలు ఇవ్వాలి అంటే ఇక్కడ సన్నల పంట అవసరం. సన్నలలో అనేక తేడాలు ఉంటాయి. BPT లో మాత్రమే నూక శాతం ఎక్కువ ఉంటుంది.. ఇతర రకాలలో దిగుబడి రెండు కిలోల తేడా మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో సన్నాలు పండించే అవకాశాలు ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి సన్నలు దిగుమతి చేసుకుంటున్నాం. దొడ్డు వడ్లు ఆదుకునే భాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తప్పక ఆదుకునే ఆలోచన చేస్తుంది. రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవ్వాళ రైతులకు మూడు రోజులలోనే ప్రభుత్వం సేకరించిన ధాన్యం డబ్బులు వస్తున్నాయి. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. గతంలో ఐదు నుంచి పది కిలోల తరుగు తీశారు. రైతులకి కాంగ్రెస్ పాలనలో లబ్ధి జరుగుతుంది. తడిసిన ధాన్యం కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మిలర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకోలేదా..? ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వండి స్వీకరిస్తాం. కేసీఆర్ మొదట సన్నకు వేయమన్నారు… తర్వాత వరి వేస్తే ఉరే అన్నారు.. కేంద్రం మెలిక పెట్టింది అని తప్పించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన తప్పులు చేశారు కాబట్టి మిగిలిన వారు అలానే చేశారు అనుకుంటున్నాడు.’ అని అన్వేష్ రెడ్డి అన్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!