Anushka : సడెన్‌గా ఇలా షాకి చ్చావేంటి అనుష్క ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka : స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జునతో కలిసి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి సినిమాతో తన నటవిశ్వరూపాన్ని చూపించి.. స్టార్ స్టేటస్ అందుకుంది. అప్పటి నుంచి అనుష్కను జేజమ్మగా పిలవడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. గత ఏడాది నవీన్ పొలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. బాహుబలి తర్వాత ఆమె చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇటీవల మళయాళంలో మొదటి సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కింది. జయసూర్య ఈ చిత్రంలో మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ‘కథనాల్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కింది. హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ లో రోజిన్ థామస్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది.
Read Also:Governor Jishnu Dev Varma: సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
సినిమాల సంఖ్య తగ్గించే సరికి ఆమె పెళ్లి చేసేసుకుందని అంతా భావిస్తున్నారు. కానీ అలాంటి షాకింగ్ వార్తలు మాత్రం జేజమ్మ చెప్పడం లేదు. ఇప్పటికే పలుసార్లు అనుష్క పెళ్లి ప్రస్తావనలు వచ్చాయి. ప్రభాస్ తో అంటూ, ఫారిన్‌లో ఉన్న పారిశ్రామికవేత్తతో అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అనుష్క నా కెరీర్ ఇంకా పూర్తి కాలేదంటూ వరుస సినిమాలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్‌తో ఘాటి అనే సినిమా చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ.. అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ ఇప్పుడు ఒకటి కాదు.. అనుష్క రెండు సినిమాలు పూర్తి చేసిందనేలా సడెన్‌గా షాకింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో అనుష్క ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇక అనుష్క మలయాళంలో కథనార్ అనే మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే చిత్రాలను అనుష్క పూర్తి చేసిందట. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. ఏదయితేనేం ఆఫ్టర్ లాంగ్ టైమ్.. అనుష్క సినిమాలకు సంబంధించి ఇలాంటి వార్త రావడం ప్రేక్షకులకు కూడా సంతోషానిస్తున్నది.
Read Also:RBI: ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానంలో మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి: శక్తికాంత దాస్
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!