Virat Kohli: కోహ్లీని మీరైనా కాస్త ఆపండి.. అనుష్క శర్మకు స్పెషల్ రిక్వెస్ట్!
- టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్
- టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్న కోహ్లీ
- వీడ్కోలు పలకొద్దని కోరుతున్న ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఉన్నపళంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ‘కింగ్’ విరాట్ కోహ్లీ కూడా సాంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరాట్ బీసీసీఐకి కూడా తెలియజేశాడట. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఓవైపు భారత మాజీ క్రికెటర్లు, మరోవైపు ఫాన్స్ కూడా విరాట్ కోహ్లీ ఇప్పుడే టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకొద్దని కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు.’బాబీజీ..
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావద్దని విరాట్ భాయ్‌కి మీరైనా కాస్త చెప్పండి’ అని ట్వీట్ చేశాడు. ఇందుకు తాజాగా విరాట్, అనుష్కలు ముంబైలో కలిసి వెళ్తున్న వీడియోను జత చేశాడు. ‘అనుష్క జీ.. కోహ్లీని మీరైనా కాస్త ఆపండి’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
Also Read: Ricky Ponting: విమానం ఎక్కాక.. మనసు మార్చుకున్న రికీ పాంటింగ్!
ఐపీఎల్ 2025 అనంతరం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. 5 టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ఆరంభం కానుంది. త్వరలోనే బీసీసీఐ ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించనుంది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోకుండా బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ చర్చలు జరుపుతుందట. అనుభవజ్ఞుడైన విరాట్ ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్‌కు కీలకమవుతాడని బీసీసీఐ భావిస్తోంది. చూడాలి మరి కింగ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో. ఇక ఐపీఎల్ 2025లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 505 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఈసారి బెంగళూరు తన ఐపీఎల్ టైటిల్ కలను సాకారం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..