కేరళ భామ అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ తెగ సందడి చేస్తోంది. అఆ సినిమా తో ఈ భామ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. తన క్యూట్ అందాలతో ఈ భామ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.’అ ఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’ వంటి చిత్రాలతో హాట్రిక్ హిట్లను అందుకుంది.దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు బాగా పాపులర్ అయింది.ఫలితంగా వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే ఈ భామ నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయం అందుకోలేదు.రీసెంట్ గా ఈ భామ హీరో నిఖిల్ సరసన కార్తికేయ 2 సినిమా లో నటించింది.ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయం సాధించింది.కార్తీకేయ2′ సక్సెస్ తర్వాత అనుపమా పరమేశ్వరన్ కెరీర్ మళ్లీ స్పీడ్ అందుకుంది. వరుస చిత్రాలలో నటిస్తుంది.
అనుపమా ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ తో పాటు మాస్ రాజా రవితేజ సరసన ‘ఈగల్’ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే తమిళం లో ‘సైరెన్’ అనే సినిమా కూడా చేస్తోంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.అటు వెండితెరపై వరుస సినిమాలలో అలరిస్తూనే ఉన్న అనుపమా ఇటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది.కొద్దికాలంగా అనుపమా అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ ఘాటైనా పోజులతో రెచ్చగొడుతుంది.. టెంప్టింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా అనుపమా షేర్ చేసిన ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో ఈ మలయాళీ ముద్దుగుమ్మ పరువాల ప్రదర్శన తో రెచ్చగొడుతుంది.కిల్లింగ్ లుక్స్ తో టెంపరేచర్ పెంచేస్తుంది. ఈ యంగ్ బ్యూటీ అందానికి ఫిదా అవుతూ నెటిజన్స్ హాట్ గా కామెంట్లు కూడా పెడుతున్నారు.