దర్శకుడు అనుదీప్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. పిట్టగోడ సినిమాతో దర్శకుడి గా పరిచయం అయ్యాడు అనుదీప్. ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత నవీన్ పోలిశెట్టి హీరోగా జాతి రత్నాలు సినిమా ను తెరకెక్కించాడు.. ఈ సినిమాలో తనదైన కామెడీ పంచ్ లతో అద్భుతంగా తెరకెక్కించాడు.జాతి రత్నాలు సినిమాతో దర్శకుడు అనుదీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ హీరో గా తెలుగు మరియు తమిళ్ భాషల్లో ప్రిన్స్ అనే సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది ఇక ఇప్పుడు అనుదిప్ తెలుగుతో పాటు గా తమిళ్ లో కూడా మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు.మరి ఆయన తరువాత సినిమా ఎవరితో చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.. అప్పట్లో వెంకటేష్ కి ఒక కథ చెప్పిన అనుదిప్ ఆ తర్వాత వెంకటేష్ తో సినిమా చేయబోతున్నారు అంటు వార్తలు కూడా వచ్చాయి. అయిన ఆ సినిమా ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు.
ప్రస్తుతం వెంకటేష్, శైలేష్ కొలను దర్శకత్వం లో సైంధవ్ అనే సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే దర్శకుడు అనుదీప్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అనుదిప్ రీసెంట్ గా స్టార్ హీరో కార్తీ తో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి కానీ ఈ సినిమా గురించి కూడా అధికారిక ప్రకటన రాలేదు.దర్శకుడు అనుదీప్ ఈ రెండు సినిమాల్లో ముందు గా ఎవరితో సినిమా చేస్తాడో తెలియాల్సి ఉంది….అయితే అనుదిప్ ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని సమాచారం..దీనితో తన తరువాత సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది.మరీ ఈ బ్యానర్ లో అనుదీప్ ఏ హీరో తో సినిమాను చేస్తాడో చూడాలి.