ఆరంభం నుండి తనివు వరకు వరుస హిట్లతో జోరు మీదున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ దౌడ్‌కు బ్రేకులేశాడు మజీజ్ తిరుమనేని. ఫిబ్రవరి 6న విడుదలైన విదాముయర్చి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిజల్ట్ ముందే గ్రహించారేమో సరిగ్గా ప్రమోషన్లను కూడా చేయలేదు మేకర్స్. విదాముయర్చి వీక్ ఫెర్మామెన్స్ చూసి ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ లెక్కలు తేల్చేస్తాడని హోప్స్‌తో ఉన్నారు.
Also Read : Dulquer Salmaan : లాంగ్ గ్యాప్ తర్వాత మలయాళంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్
అజిత్ డై హార్ట్ ఫ్యానైన దర్శకుడు అధిక్ రవిచంద్రన్. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేయడమే కాదు, ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. కొన్ని సీన్లు చూసి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఎమోషనల్ అవుతున్నారు. యూట్యూబ్‌ను కూడా షేక్ చేసింది టీజర్. 24 గంటల్లో 31 మిలియన్ వ్యూస్‌తో ఇప్పటి వరకు రిలీజైన టీజర్లలో ఫస్ట్ ప్లేసులో ఉంది గుడ్ బ్యాడ్ అగ్లీ. తమిళంలో వచ్చిన రెస్పాన్స్ తో తెలుగులో కూడా రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. సాల్ట్ పెప్పర్ లుక్కు నుండి బయటకు రాలేకపోతున్న అజిత్‌ను సరికొత్తగా మేకోవర్ చేశాడు అధిక్ రవిచంద్రన్. కొన్ని సీన్లలో వింటేజ్ లుక్కులో కనిపిస్తున్నాడు అజిత్. అలాగే అజిత్ ఓల్ట్ సినిమాలైన వాలి, బిల్లా, అమరకాలం, అట్టగాసం, వేదాళం, దీనాలోని ఒక్కొక్క సీన్ గుడ్ బ్యాడ్ అగ్లీలోని కొన్నిషాట్లను పోలుస్తూ సోషల్ మీడియాలో వీడియోలను రిలీజ్ చేస్తూ ఏకే సంభవం అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ సినిమాల్లోని సీన్లను అధిక్ కాపీకొట్టాడా అన్న అనుమానం రాకపోదు. కానీ ఫ్యాన్స్ అవన్నీ పట్టించుకోవడం లేదు. టీజర్ చూసి ఊగిపోతున్న అభిమానులు ఏప్రిల్ 10 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.