దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా రెడ్‌లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 122 పాయింట్లు నష్టపోయి 76, 171 దగ్గర ముగియగా.. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 23, 045 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన.. హైకోర్టు కీలక ఆదేశం
ఇక నిఫ్టీలో ఎం అండ్ ఎం, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐషర్ మోటార్స్, ఐటీసీ, హీరో మోటోకార్ప్ ప్రధానంగా నష్టపోగా.. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్స్యూమర్ లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. పీఎస్‌యూ బ్యాంక్ మరియు మెటల్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: Prudhvi Raj: వైసీపీ అభిమానులపై ల’కారాలతో రెచ్చిపోయిన పృథ్వి రాజ్