బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమాలో రణ్ బీర్ ను రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో చూపించబోతున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసింది ఒక్కటే సినిమా అది కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.సందీప్ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసింది. అలాగే అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరు తో రీమేక్ చేసారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరో గా నటించారు. ఈ సినిమా కూడా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయ్ సాధించింది. దీనితో సందీప్ వంగా కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. దీనితో ఆయన బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాను తెరకేక్కిస్తన్నారు. అలాగే టాలీవుడ్ లో ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేసేందుకు కూడా సిద్ధం అయ్యారు.
బాలీవుడ్ లో రొమాంటిక్ ఇమేజ్ ఉన్న రణ్‌బీర్ కపూర్ తో యానిమల్ అనే ఊరమాస్ సినిమా తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా లో హీరోయిన్‌గా రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన యానిమల్ ప్రీ టీజర్ అదిరిపోయింది.ఇక ఇప్పుడు టీజర్ రిలీజ్ కు సిద్ధం అయ్యారు మేకర్స్… ఇక తాజాగా యానిమల్ టీజర్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ను. రణ్‌బీర్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వగా టీజర్ కట్ చేసే పనిలో ఎంతగానో బిజీగా ఉన్నాడట. దీంతో ఈ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.సందీప్ నుంచి రాబోతున్న ఈ సెకండ్ ఫిల్మ్ ఎలా ఉంటుందా అని బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. యానిమల్ టీజర్‌తో ఈ సినిమా కథ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది.