సీఎం జగనే నాకు కొండంత అండ.నేను ఒంటరిని కాదు.. నాకు ఏ వర్గమూ లేదు.సీఎం అండ ఉండగా నేను ఎందుకు ఒంటరి అవుతాను..? అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రెండు జిల్లాలకు రీజినల్ కో ఆర్డినేటర్ ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ణతలు తెలిపేందుకు వచ్చా.పార్టీని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు.మేం సీఎం మనషులం.. సీఎం గీత గీస్తే దాటం.
నెల్లూరులో కోల్డ్ వార్ అంటూ ఏమీ లేదు.కుటుంబంలో ఎక్కడైనా చిన్నచిన్న విభేధాలు ఉంటాయి.అందరూ కలసి కట్టుగా పని చేస్తాం.మాకు వర్గాలనేవి ఏవీ అసలు ఉండవు.. అంతా జగన్ వర్గమే.నా నియోజక వర్గంలో ఫ్లెక్సీలు వేయడమనేది రెండున్నరేళ్లుగా ఎక్కడా లేదు.నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్లెక్సీలు ఎవరు వేసినా తీసేశాం.నెల్లూరు సిటీలో ఎవరు ఫ్లెక్సీ కట్టినా తీసేస్తారు.
మేం ఫ్లెక్సీలు ఎక్కడా తీయలేదు.. మున్సిపాల్టీవారే తీసేశారు.ఆ రోజున గాలికి వేమిరెడ్డి హోర్డింగ్ లు కొన్ని చిరిగి పోయాయి.హోర్డింగ్సులో 7లో 1 మాత్రమే గాలికి చిరిగింది.వేమిరెడ్డి పై ఏర్పాటు చేసిన హోర్డింగులు కూడా గాలికి చిరిగాయి. ఎవరైనా నాకు కొంత సాయం చేస్తే అంతకన్నా ఎక్కువగా నేను సాయం చేస్తా. 2024 లో సీఎం జగన్ని మళ్లీ సీఎం ను చేయడమే లక్ష్యం అన్నారు అనిల్. నేను రెండు జిల్లాలే కాదు.. రాష్ట్రమంతా తిరుగుతానన్నారు.
అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తా.మళ్లీ అధికారంలోకి వస్తాం.. తీసేసిన 14 మంది తిరిగి మంత్రులు అవుతాం.కాకాని, నేను.. ఇద్దరం విడివిడిగా సీఎంను కలిశాం.ఎవరైనా జగన్ బొమ్మపై గెలవాల్సిందే.ఆనంపై నేను సీఎంకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. సీఎంకు చాడీలు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నెల్లూరులో నాకు నేనే.. నాకు ఏ వర్గమూ లేదు.
Read Also: Kakani Govardhan Reddy: జగన్తో ముగిసిన మంత్రి కాకాణి భేటీ