Site icon NTV Telugu

Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే రికార్డ్ నాదే..

Anil Ravipudi

Anil Ravipudi

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి కూడా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీతో రాబోతున్నాడు. అది కూడా ఇద్దరు అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్‌లను ఒకే తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మళ్లీ సినిమాల్లోకి వచ్చాక ‘అన్నయ్య’, ‘చూడాలని ఉంది’ వంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయలేదు. అందుకే ఆయన ఇమేజ్‌కు తగిన మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, బలమైన కుటుంబ భావోద్వేగాలను జోడించి ఈ కథను రూపొందించాను. చిరంజీవి అల్లరి, వెంకటేష్ టైమింగ్ ప్రేక్షకులను టైమ్ మెషిన్ ఎక్కి పాత రోజుల్లోకి తీసుకెళ్తాయి’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ ‘వెంకీ గౌడ’ అనే కర్ణాటక బిజినెస్‌మెన్ పాత్రలో కనిపిస్తారు, వీరిద్దరూ కలిసి సుమారు 20 నిమిషాల పాటు స్క్రీన్ పంచుకుంటారు’ అనిల్ వెల్లడించారు. అంతే కాదు..

Also Read : Ananya Nagalla : టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలను గుర్తించరు: అనన్య

తన కెరీర్ రికార్డులపై కూడా అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలను డైరెక్ట్ చేసిన.. త్వరలోనే నాగార్జునతో కూడా సినిమా చేయాలని ఉంది. నాగార్జున గారితో సినిమా చేస్తే, ఈ తరం దర్శకుల్లో నలుగురు అగ్ర హీరోలతో పని చేసిన ఏకైక దర్శకుడిగా నా పేరిట రికార్డ్ క్రియేట్ అవుతుంది’ అని ఆయన మనసులో మాట బయటపెట్టారు. అలాగే నిర్మాత శ్రేయస్సు కోరి బడ్జెట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటానని, అందుకే తన నిర్మాతలందరూ హ్యాపీగా ఉన్నారని తెలిపారు. నయనతార ఈ చిత్రం కోసం ప్రమోషనల్ వీడియోలు చేయడం తన నిజాయితీ కి దక్కిన గౌరవంగా అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

Exit mobile version