టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి పరిచయం అక్కర్లేదు. ‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ సినిమాలతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే అనన్య తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బొంబాయి నుంచి వచ్చిన హీరోయిన్లకు దక్కినంత త్వరగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని ఆమె కుండబద్దలు కొట్టింది.
Also Read : The Rajasaab: ప్రభాస్ ‘రాజాసాబ్’పై కాపీ ఆరోపణలు.. తమన్‌కు విదేశీ డీజే వార్నింగ్
‘బొంబాయి నుంచి వచ్చానని చెప్పుంటే అవకాశాలు త్వరగా వచ్చేవేమో కానీ, ఇండస్ట్రీలో లాంగ్ కెరీర్ ఉండాలంటే మాత్రం తెలుగు అమ్మాయిలే కరెక్ట్’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అంతే కాదు..’వకీల్ సాబ్’ వంటి పెద్ద సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని ఆశించినా, కొంత గ్యాప్ అయితే వచ్చింది అని తెలిపింది. తనకు కేవలం ‘ట్రెడిషనల్’ పాత్రలకే పరిమితం చేయవద్దని, గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా తాను సిద్ధమేనని స్పష్టం చేసింది. అందుకే సోషల్ మీడియాలో ఫోటోషూట్‌లతో తన ఇమేజ్‌ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఐదేళ్ల కెరీర్‌లో రెండేళ్లు కరోనా వల్ల నష్టపోయినా, ప్రస్తుతం ఏకంగా ఏడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెబుతూ తన సత్తా చాటుతోంది ఈ తెలుగు బ్యూటీ.