Eggs Production: కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ నెంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eggs Production: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్త.. కోడిగుడ్ల ఉత్పిత్తిలో ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచినట్లు తాజాగా విడుదలైన కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే 2022 వెల్లడించింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంటే.. మనదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిన విషయాన్ని తాజాగా విడుదల చేసిన సర్వేలో పేర్కొన్నారు. కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో తలసరి గుడ్ల లభ్యత అత్యధికంగా ఉందని.. ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఏడాదికి తలసరి 501 గుడ్ల లభ్యతతో నంబర్–1 స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. గుడ్ల లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సర్వే పేర్కొంది. తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా.. దేశవ్యాప్తంగా ఏడాదికి సగటు తలసరి గుడ్ల లభ్యత కేవలం 95 మాత్రమే ఉందని సర్వే పేర్కొంది.
1950-51 లో ఏడాదికి తలసరి కోడిగుడ్ల లభ్యత మన దేశంలో కేవలం ఐదు మాత్రమే ఉండగా.. తొలిసారిగా 1968–69లో జాతీయ స్థాయిలో సగటు తలసరి గుడ్ల లభ్యత 10కి చేరిందని సర్వే పేర్కొంది. 2020–21లో జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి గుడ్ల లభ్యత 90 ఉండగా 2021–22లో 95కు చేరినట్టు వెల్లడించింది. కానీ.. అందుకు 5 రెట్లు ఎక్కువగా ఏపీ ఉండటం గమనార్హం.
Also Read
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
Read Also: Minister KTR: అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణదే మొదటి స్థానం
కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు రెండో స్థానంలో.. తెలంగాణ మూడో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగో స్థానంలో పశ్చిమ బెంగాల్.. ఐదో స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీలో పెరటి కోళ్ల ఉత్పత్తి గడిచిన రెండేళ్లలో పెరిగినట్లుగా పేర్కొన్నారు. 2020-21లో పెరటి కోళ్ల సంఖ్య 1,23,70, 740 ఉండగా.. 2021-22లో 1,31,69,200కు పెరిగినట్లుగా సర్వే వెల్లడించింది. కాగా.. కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలోనూ దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల లభ్యతలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు గుడ్ల ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలోను.. గుడ్ల లభ్యతలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఉత్పత్తిలో మాత్రం మూడో స్థానంలోనూ ఉన్నాయని సర్వే పేర్కొంది.
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!