AP Weather: ఏపీకి అలర్ట్.. రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షం కురిసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం నాడు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ( బుధవారం ) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.
Read Also: RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీ లీక్.. ఫొటో ఇదిగో
Also Read
- Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఇక, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. దయచేసి వ్యవసాయ, ఉపాధి పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండకండి.. పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు.. అలాగే, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి అని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచనలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?