పంచ గ్రామాల సమస్యకు టైం బాండ్ పెట్టుకొని పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నగరంలో గుంతల రోడ్లు ఉండటానికి వీలు లేదు.. ఎక్కడైనా ఉంటే అధికారులపై చర్యలు తప్పవన్నారు.
ఉచిత ఇసుక విధానాన్ని మరింత సరళం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుక పాలసీ 2024లో సీనరేజి ఫీజు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు. ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21న జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.