NTV Telugu Site icon

Pawan Kalyan : తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్.. వెన్ను, కాలు నొప్పితో ఇబ్బంది

Pawan Kalyan

Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం తిరుమల.. అలిపిరి నడకమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. నాలుగున్నర గంటల్లో నడక మార్గాన తిరుమలకు వచ్చారు. వెన్ను, కాలు నొప్పితో ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్.. తీవ్ర అలసటకు గురై.. మార్గం మధ్యలో పలు చోట్ల విశ్రాంతి తీసుకున్నారు. నొప్పిని భరిస్తూన్నే మెట్లు ఎక్కుతూ తిరుమలకు వచ్చారు.

READ MORE: UP: యూపీలో దారుణం.. డెలివరీ బాయ్‌ను చంపి రూ.90వేల ఫోన్లు అపహరణ

ఇదిలా ఉండగా.. తిరుమల లడ్డు తయారీలో కల్తీ అంశంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈరోజు ఆ దీక్ష విరమించేందుకు తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు పవన్‌. పవన్ వెంట ఆయన సన్నిహితుడు, సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. ఇక తిరుమలకు పవన్‌ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్‌ కల్యాణ్.. శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారని సమాచారం.

READ MORE: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

ఇక రేపు ఉదయం 8:15 నిమిషాలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల వరకు అన్నదానం సముదాయం, క్యూలైన్లను పవన్ తనిఖీ చేయనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పాల్గొననున్న పవన్‌ రాత్రి 8:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరంకు పవన్‌కల్యాణ్ బయలుదేరి వెళ్లనున్నారు.

Show comments