Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ.. అండగా ఉంటామని భరోసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizianagaram Train Accident: విజయనగరం జిల్లా కంటాకపల్లి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటికే 15 మంది మృతిచెందినట్టు గుర్తించారు అధికారులు.. తీవ్రగాయాపాలమైన చాలా మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.. ఇక, రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి నుంచి విజయనగరం వెళ్లిన ఆయన.. మొదట విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట రైలు ప్రమాదంపై అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు..
ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించాలనుకున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఘటనా స్థలంలో సహాయక చర్యలు జరుగుతోన్న నేపథ్యంలో.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు ఏపీ సీఎం.. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్‌లో దిగారు.. ఆపై విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
కాగా, కంటాకపల్లి వద్ద ఆదివారం రైలు ప్రమాదం చోటు చేసుకుంది.. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వచ్చిన రాయగడ ప్యాసింజర్ రైలు వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా.. 100 మందికి పై బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు.. మరోవైపు.. ఈ ప్రమాదంలో మృతిచెందిన రాష్ట్ర వాసుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహాన్ని ప్రకటించారు సీఎం జగన్.. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు.
మరోవైపు.. బాధితులను పరామర్శించిన తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు సీఎం వైఎస్ జగన్.. ”విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం.. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను.. వారు కోలుకునేంత వరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది.. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను.” అంటూ తన ట్వీట్ (ఎక్స్)లో రాసుకొచ్చారు.
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2023
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!