NTV Telugu Site icon

Anchor Shyamala: దిశ లాంటి గొప్ప చట్టాన్ని నిర్వీర్యం చేశారు.. శ్యామల కీలక వ్యాఖ్యలు

Shyamala

Shyamala

Anchor Shyamala: కూటమి ప్రభుత్వం పాలన మహిళలకు చీకటి కాలమని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కారణం ఎవరు.. నేరస్థులకు ఇంత ధైర్యం ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేయటం లేదని ఆమె ఆరోపించారు. చంద్రబాబు కూటమి బలాన్ని ఎందుకు వాడుకుంటున్నారు.. అధికారులపై ఒత్తిడి తేవడం కోసం వాడుకుంటున్నారని శ్యామల అన్నారు. మహిళకు రక్షణ కోసం కూటమి బలాన్ని చంద్రబాబు వాడుకోవడం లేదని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో బాధిత మహిళ న్యాయం కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళవలసి వచ్చిందని.. చివరికి ఆమెతో రాజీ కుదిర్చారని ఆరోపించారు. దళిత బాలిక అయినందుకు బాధితురాలిని పవన్ కళ్యాణ్ పరామర్శించలేదని విమర్శలు గుప్పించారు.

Read Also: CM Chandrababu: 15 రోజుల్లో డ్రోన్ పాలసీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

హిందూపురంలో మహిళపై అఘాయిత్యానికి పాల్పడితే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. మహిళా హోంమంత్రి ఎక్కడ… మీకు ఆ బాధ్యత లేదా…మీరు మహిళే కదా అంటూ వ్యాఖ్యానించారు. జగన్ ప్రవేశపెట్టిన దిశ యాప్‌ని మళ్ళీ తీసుకురావాలన్నారు. వీటి వల్ల ఏదొక విధంగా మహిళకు సహాయం అందుతుందన్నారు. దిశ లాంటి గొప్ప చట్టాన్ని రాజకీయ కక్షతో పక్కన పెట్టారని అన్నారు. పత్రికలలో ప్రకటనలు తప్ప చేతల్లో ఏమి లేదని పేర్కొన్నారు. 200మంది మహిళలపై దాడులు జరిగాయన్నారు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా రెచ్చిపోతోందని అన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక తాగేందుకు నీరు లేక డయేరియాతో జనం చచ్చిపోతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇంక ఎన్నాళ్లు ఈ దారుణాలని తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారన్నారు. మీరు ఇలానే వ్యవహరిస్తే ప్రజా క్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తామని శ్యామల మండిపడ్డారు.