కూటమి ప్రభుత్వం పాలన మహిళలకు చీకటి కాలమని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కారణం ఎవరు.. నేరస్థులకు ఇంత ధైర్యం ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేయటం లేదని ఆమె ఆరోపించారు. చంద్రబాబు కూటమి బలాన్ని ఎందుకు వాడుకుంటున్నారు.. అధికారులపై ఒత్తిడి తేవడం కోసం వాడుకుంటున్నారని శ్యామల అన్నారు.