తెలుగు బుల్లితెర యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు సుమతో పాటుగా మంచి ఫేమ్ తెచ్చుకుంది.. పలు టీవీ షోలతో జనాలను అలరించింది.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో అక్కడ బిజీగా అయ్యింది.. పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది.. గత ఏడాది వాల్తేరు వీరయ్య, దసరా, సలార్ వంటి సినిమాల్లో నటించారు.. ప్రస్తుతం ఝాన్సీకి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఒకప్పుడు యాంకర్ గా బుల్లితెర పై తరుచు కనిపించిన ఝాన్సీ.. ప్రస్తుతం టెలివిజన్ లో కనిపించడమే మానేశారు. అయితే ట్రెండ్ కి తగ్గట్లు సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటున్నారు. తన మూవీ షూటింగ్ విషయాలు గురించి, లైఫ్ స్టైల్ విషయాలు విషయాలు గురించి నెటిజెన్స్ కి టిప్స్ ఇచ్చేలా పోస్టులు చేస్తూ సోషల్ మీడియాలో ఆడియన్స్ కి దగ్గరగా ఉంటున్నారు.. తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది..
ఆ పోస్టులో ఝాన్సీ రోడ్డు పై చెత్త సేకరిస్తూ కనిపించారు. రోడ్డు పక్కన పడేసిన చెత్తని జాగ్రత్తగా సేకరించి తన కారులో తీసుకోని వెళ్లారు. ఆమె అలా ఎందుకు చేశారు.. ఎండిన ఆకులను,ఎండి గడ్డిని కాల్చి బూడిద చేయకండి. అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి. అవి ప్రకృతి సమతౌల్య సూత్రం’ అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో మాత్రమే కాదు గతంలో ఆవు పేడని కూడా ప్రకృతి పద్దతిగా ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలియజేస్తూ వీడియోలు పోస్టు చేశారు.. ఆ వీడియోలు చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు..