అనసూయ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అనసూయ. వరుస సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం యాంకరింగ్ కు దూరమయింది ఈ భామ. పలు సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది అనసూయ. అనసూయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా వుంటారు.ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు తను నటించే సినిమాలకి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.. అనసూయకు హీరో విజయ్ దేవరకొండతో వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే.అనసూయ పరోక్షంగా ఆ హీరో అభిమానులకు వ్యతిరేకంగా ట్వీట్స్ కూడా చేస్తూ ఉండేది..అయితే విజయ్ ఫ్యాన్స్ ఈమెను భారీ స్థాయిలో ట్రోల్స్ చేయడంతో విసిగిపోయిన ఈమె ఈ వివాదానికి ముగింపు పలకబోతున్నాను అంటూ ఒక పోస్ట్ కూడా చేసారు.. అయితే ఇన్ని రోజులు పాటు తన గురించి ఎవరేమన్నా ఎంతో సైలెంట్ గా ఉన్న అనసూయ మరోసారి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే అనసూయ తాజాగా చేసిన ఈ పోస్టులో ఎవరి పేరును ప్రస్తావించలేదు. అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో మాత్రం అర్థం కావడం లేదు.ఈ సందర్భంగా ఈమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నేను వాళ్లకు ఎంతో ముఖ్యం. నా ప్రమేయం ఉన్నా.. లేకున్నా నాకు సంబంధం ఉన్నా లేకున్నా నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదు. నాపై వారు అంతగా డిపెండ్ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏ పని చేయలేకపోతున్నారు అంటూ ట్వీట్ చేసింది..ప్రస్తుతం అనసూయ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలోబాగా వైరల్ గా మారడంతో ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు అసలు మిమ్మల్ని ఎవరేమి అన్నారు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరీ అనసూయ ఎవరి గురించి ఆ ట్వీట్ చేసిందో క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.
https://twitter.com/anusuyakhasba/status/1679884491605807107?s=20