Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా యల్లనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తీవ్ర కలకలం రేపిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిపై సస్పెన్షన్ వేటు వేశారు. పాఠశాలలో విద్యార్థినుల పట్ల సదరు ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, అవాంఛనీయంగా తాకుతున్నాడని కొద్ది రోజులుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై బాధితులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆగ్రహంతో పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో పాఠశాల ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) యల్.పి. చంద్రశేఖర్ వెంటనే అక్కడికి చేరుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
తల్లిదండ్రుల తీవ్ర నిరసనలు, ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. అధికారుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు ఉపాధ్యాయుడు గతంలో పనిచేసిన పలు పాఠశాలల్లోనూ ఇలాంటి అసభ్య ప్రవర్తనకు సంబంధించి పలు ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తనపై గతంలోనూ విమర్శలు ఉన్నప్పటికీ తీరు మార్చుకోకపోవడం గమనార్హం.
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఈ వ్యవహారంపై విచారణాధికారులు సమర్పించిన సమగ్ర నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు, ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో మంగళవారం రోజున ఫిజికల్ సైన్స్ టీచర్ శ్రీరామమూర్తిని విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థినుల భద్రతకు ముప్పు కలిగించేలా ప్రవర్తించే వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు ఉంటాయని, ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..