Anand Mahindra: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు వింతగా అనిపించిన దృశ్యాలను షేర్ చేస్తూ నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోనే ప్రస్తుతం మరోమారు ఆయన షేర్ చేశారు. ఇప్పుడు అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సముద్రం పక్కనే ఓ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ లో ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసి, పక్కనే కాసేపు సేద తీరేందుకు రిక్లైనర్ మాదిరి పడక కుర్చీలు ఏర్పాటు చేసి ఉన్నాయి. రెండు కుర్చీలు ఉంటే, అందులో ఒక కుర్చీలో ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఇంతలో సముద్రం నుంచి చిన్నగా రిసార్ట్ లోకి పాకుకుంటూ వచ్చిన సీల్ చేప స్విమ్మింగ్ పూల్ లోకి దిగింది. అటూ ఇటూ రెండు రౌండ్లు ఈదిన తర్వాత ఒడ్డుకు చేరి ఆ వ్యక్తి కూర్చున్న పడక కుర్చీ వైపు వచ్చేస్తుండడంతో.. సదరు వ్యక్తి లేచి దానికి దారిచ్చాడు. అది దర్జాగా ఆ కుర్చీ ఎక్కి పడుకుంది. అంటే అచ్చం వ్యక్తి చేసినట్టుగా ఇది అనుకరించింది. సాధారణంగా సీల్ చేపలకు తెలివి ఎక్కువగా ఉంటుందని అంటారు. అవి మనుషులతో చాలా సందర్భాల్లో సన్నిహితంగా ఉంటాయని రుజువైంది కూడా.
I believe this is one ‘gentleman’ who had his weekend plans all figured out….#Friday pic.twitter.com/GAIJvnxQtz
— anand mahindra (@anandmahindra) December 16, 2022