Hyderabad CP: హైదరాబాద్ లో అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్జల్ గంజ్ పోలీసులు టీఎస్ న్యాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశామని హైదరాబద్ సీపీ సందీప్ సాండిల్య తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 1464 నైట్రావెట్ మాత్రలు (సైకోట్రోపిక్ డ్రగ్), రెండు మొబైల్ ఫోన్‌లు సీజ్ చేశాం.. ప్రధాన నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బిర్జు ఉపాధ్యాయ పై బీదర్లో రౌడీ షీట్ ఉంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన బిర్జు ఉపాధ్యాయ్ తో పాటు కుటుంబం గత 14 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటూ నైట్రావెట్ మాత్రలు విక్రయిస్తుంది.. మరో నిందితుడు కిషన్ విట్టల్ రావు కాంబ్లే బిర్జు ఉపాధ్యాయ్ కు అసోసియేట్ గా వ్యవహరిస్తాడు అని సీపీ తెలిపారు.
Read Also: Minister KTR: తెలంగాణ ఏర్పాటు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి..
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
గుల్బర్గాకు చెందిన సుప్రీత్ నవలే అనే వ్యక్తి నుండి బిర్జు ఉపాధ్యాయ్ మాత్రలు కొనుగోలు చేస్తాడు అని సీపీ సాండిల్య పేర్కొన్నారు. ఒక్కో నైట్రావెట్ మాత్రల బాక్స్ ను రెండు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని డ్రగ్ పెడ్లర్లకు రూ. 5,500 అక్రమంగా విక్రయించారు.. బిర్జు ఉపాధ్యాయ్ తన భార్య కుమారుడు అత్త సహకారంతో కర్ణాటక నుండి హైదరాబాద్ కి డ్రగ్ సరఫరా చేసేవాడు అని ఆయన చెప్పుకొచ్చారు. బిర్జు తన బంధువు రాను భాయి అనే వ్యక్తికి టాబ్లెట్స్ ఇచ్చి కర్ణాటక నుండి హైదరాబాద్ పంపాడు అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సాండిల్య చెప్పారు.
Read Also: Rohit Sharma: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ ముందు మూడు రికార్డులు!
ఈ టాబ్లెట్స్ ను మాంగర్ బస్తీలో నివాసం ఉంటున్న రాజు, పల్లవి అనే తన బంధువులకు సరఫరా చేయాల్సి ఉంది.. ఈ క్రమంలో నిందితుడు రాను భాయి కర్ణాటక నుండి నైట్రావెట్ ట్యాబ్లెట్‌లను తీసుకుని Mgbs లో బస్సు దిగాడు అని సందీప్ సాండిల్య తెలిపారు. నైట్రావెట్ మాత్రలను మాంగేర్ బస్తీలోని హబీబ్‌నగర్ ను తీసుకు వెళ్తూ ఉండగా టీఎస్‌న్యాబ్, అఫ్జల్‌గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆపై మంగర్బస్తీలోని నిందితుల ఇంటిపై దాడి చేసారు.. నిందితుల నివాసంలో 11 బాక్స్‌ల నైట్రావెట్ టాబ్లెట్‌లు 22 ఎస్కుఫ్ సిరప్ లను సీజ్ చేసాం.. బంగారు బస్తిలోని బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు బీదర్ లోని బిరుసు ఫ్యామిలీ పట్టుకునేందుకు హెచ్‌న్యూకి చెందిన ఐదుగురు పోలీసు సిబ్బంది వెళ్ళారు.. నిందితులు ఇంటిపై ఈ నెల నాలుగో తేదీన తెల్లవారుజామున 1 గంటలకు రైడ్ చేశారు.. ఉమ్మడి కుటుంబం కావడంతో ఒక్కసారిగా కుటుంబం అంతా కలిసి మా పోలీసులపై దాడి చేశారు అని హైదరాబాద్ సీపీ సందీప్ సాండిల్య వెల్లడించారు.
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!