Extramarital Affair: ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తితో ఎఫైర్.. ప్రియుడితో కలిసి భర్త హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affair: పెళ్లై, పిల్లలు ఉన్నా.. కొంతమంది శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. కుటుంబ బాధ్యతలు, సంపాదనలో భర్త బిజీగా ఉంటే.. మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంటున్నారు.. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడం.. అందులో అడ్డమైన సోషల్ మీడియా యాప్‌లు అన్నీ ఉండడంతో.. కొత్త పరిచయాల కోసం పరితపించిపోతున్నారు.. ఇక, ఆ పరిచయాలు కాస్తా వివాహేతర సంబంధాలకు దారితీయడం.. అడ్డుగా ఉన్న భర్తను, పిల్లలను కూడా చంపేందుకు వెనుకాడడం లేదు.. తాజాగా, ఏలూరు జిల్లాలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన చంద్రశేఖర్ అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరిని వివాహం చేసుకున్నాడు.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. నారాయణపురంలోని టైల్స్ పరిశ్రమలో పనిచేస్తున్న చంద్రశేఖర్.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంగుటూరు మండలం నారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. అయితే, తన భర్తను హత్య చేశారని భువనేశ్వరి పోలీసులకు నిన్న ఫిర్యాదు చేసింది.. విచారణ చేపట్టిన నిడమర్రు సీఐ మోగంటి వెంకట సుభాష్, చేబ్రోలు ఎస్ఐ స్వామి.. మృతుడి మెడమీద పొదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచినట్లు, తీవ్ర గాయాలను గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి.
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్‌దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
మృతుడు చంద్రశేఖర్ భార్య భువనేశ్వరికి తాడేపల్లిగూడెంకు చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని గుర్తించారు పోలీసులు.. ప్రియుడితో కలిసి తన భర్తను భువనేశ్వరే హతమార్చినట్టు తేల్చారు. అయితే, భువనేశ్వరికి ఆ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడట.. అదికాస్తా శృతిమించి వివాహేతర సంబంధానికి దారితీయగా.. తమ సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భువనేశ్వరి.. తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది.. ఇక, ఈ కేసుల్లో మరిన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్‌దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్‌పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!