Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు పంపారు.
Read Also: Balineni Srinivas Reddy: జనసేనలోకి వెళ్తున్నానని ప్రచారం చేస్తున్నారు.. బాలినేని కీలక వ్యాఖ్యలు
అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులేననే భావన కలిగేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే రెవెన్యూ శాఖ సర్కులర్ జారీ చేయనుంది. సర్క్యులర్ జారీ అయిన అనంతరం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నట్లుగానే సబ్ రిజిస్ట్రార్ సీటింగ్ ఉండనుంది.