Amit Shah: పాకిస్థాన్ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోంది.. అమిత్ షా ఆగ్రహం..
- ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారు
- పాకిస్థాన్ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోంది
- ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాం
- నిజామాబాద్ రైతు సమ్మేళన సభలో అమిత్‌షా వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్‌గాంధీపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని.. పాకిస్థాన్ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోందని మండిపడ్డారు.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని పునరుద్ఘాటించారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్లపై అంశంపై అమిత్‌షా మరోసారి
స్పందించారు.
READ MORE: Amit Shah: కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఏటీఎంగా మారింది..
Also Read
తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వారికి సూచించారు. పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్థాన్ మనల్ని భయపెట్టాలని చూసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత భారత్ శక్తి ఏమిటో పాకిస్థాన్‌కు, ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని పునరుద్ఘాటించారు. నక్సలిజాన్ని తుదముట్టించాలా లేదా..? మీరే చెప్పండి అని జనాలను కేంద్ర మంత్రి అడిగారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని సూచించారు. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలని. ఇప్పటికే 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని గుర్తు చేశారు.. జన జీవన స్రవంతిలోకి వచ్చేశారన్నారు.
READ MORE: Peddi Reddy: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
“తెలంగాణలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుంది. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బీజేపీ విజయం ఖాయమైందని తెలుస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌కు పసుపుబోర్డు సాధించారు. పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నాం. మోడీ ఏదైనా చెప్పారంటే అది తప్పకుండా చేసి చూపిస్తారు. నిజామాబాద్ రైతులు పసుపుబోర్డు కోసం 40 ఏళ్ల పాటు పోరాటం చేశారు. నిజామాబాద్ రైతులు పండించిన పసుపు భవిష్యత్‌లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుంది.” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!