Rahul gandhi: అమేథీలో రాహుల్ ఇల్లు క్లీనింగ్.. ఏం జరుగుతోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమేథీలో ఏం జరుగుతోంది. రాహుల్ తిరిగి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? సడన్‌గా నివాసాన్ని ఎందుకు శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే రాజకీయంగా చర్చ సాగుతోంది. తాజా పరిణామాలు అనేక ఊహాగానాలకు తావిస్తోంది.
అమేథీలో రాహుల్‌గాంధీ నివాసాన్ని క్లీన్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతున్నాయి. దీంతో రాహుల్ పునరాగమనం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే రాహుల్ నివాసాన్ని క్లీన్ చేస్తున్నారని తెలుస్తోంది. మంగళవారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. రాహుల్‌పై సెటైర్లు వేశారు. అమేథీలో మీ బావ కర్చీప్ వేయబోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో అమేథీపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. రాహులే అమేథీలో పోటీ చేస్తారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇది కూడా చదవండి: Pragati : గల్లీలో బుల్లెట్ పై ప్రగతి ఆంటీ.. వీడియో వైరల్..
ఇదిలా ఉంటే ఇటీవల ఘజియాబాద్‌లో అఖిలేష్ యాదవ్‌తో కలిసి రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమేథీ పోటీపై పెదవి విప్పలేదు. ఇలాంటి నిర్ణయాలను మా పార్టీలోని కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకుంటుందని, దానికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. దీంతో పోటీపై సానుకూల వాతావరణం కనిపించినట్లుగా అర్థమైంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ నివాసం రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో పోటీ చేసేందుకే రాహుల్ గాంధీ నివాసం తయారవుతున్నట్లుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇది కూడా చదవండి: Prathipati Pulla Rao: కూటమి రాకకు ప్రజలు ఎదురు చూస్తున్నారు
మే 20న ఐదో దశలో అమేథీలో పోలింగ్ జరగనుంది. ఈ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. అలాంటిది గత ఎన్నికల్లో అమేథీలో భారతీయ జనతా పార్టీకి చెందిన స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో రాహుల్ గాంధీపై విజయం సాధించింది. దీంతో అమేథీలో అనూహ్యంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు. కానీ అమేథీపై క్లారిటీ ఇవ్వలేదు. తాజా పరిస్థితులను చూస్తుంటే.. తిరిగి అమేథీలో కూడా రాహుల్ పోటీ చేయొచ్చని సమాచారం.
ఇక ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ 17 స్థానాలను లక్ష్యంగా పెట్టుకోగా, ఎస్పీ అనేక మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రంలోని మిగిలిన 63 స్థానాలకు పోటీ చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Gilli Re- Release : కళ్లు చెదిరే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విజయ్ “గిల్లి” మూవీ..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!