PM Modi: అమెరికా పర్యటనలో భారత్ కీలక ఒప్పందం..

America Tour Modi

America Tour Modi

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు డజను సాయుధ డ్రోన్లు విక్రయించేలా ఈ డీల్‌ ఉండనుందని వారు వెల్లడించారు. భారత్‌ కూడా చాలా కాలంగా అమెరికా నుంచి సాయుధ డ్రోన్లను కొనేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ, బ్యూరోక్రటిక్‌ ఇబ్బందులతో ఈ డీల్‌ ముందుకు సాగడం లేదు.. జూన్‌ 22న మోడీ అమెరికా పర్యటనలో ఈ డీల్‌ను ఓ కొలిక్కి తెస్తుందని అంచనా.

Also Read : Astrology : జూన్‌ 15, గురువారం దినఫలాలు

అమెరికాలో మోడీ పర్యటన ఖరారు కాగానే డ్రోన్‌ డీల్‌ విషయంలో పురోగతి చూపించాలని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, పెంటగాన్‌ అధికారులు భారత్‌ను సంప్రదించారు. కోరారు. దాదాపు 30 ఎంక్యూ ఖబి సీ గార్డియన్‌ డ్రోన్లను అమ్మివేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మధ్య పలు ఆయుధాల తయారీ, నిర్వహణపై ప్రధానంగా చర్చలు జరుగనున్నాయి.

Also Read : TNPL 2023: ఇదేందయ్యో ఇది.. ఒక బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్‌! వైరల్ వీడియో

మరోవైపు హై టెక్నాలజీ రంగాలకు సంబంధించిన ఏడు రంగాల్లో భాగస్వామ్యం కోసం భారత్‌, అమెరికాలు మంగళవారం న్యూఢిల్లీలో ఒక మార్గ సూచీని ఆవిష్కరించాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఇక్కడ పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ చేతుల మీదుగా ఈ ప్రొగ్రాం జరిగింది. దీనికింద సెమీ కండక్టర్లు, కొత్త తరం టెలికమ్యూనికేషన్‌, కృత్రిమ మేధ, రక్షణ రంగాల్లో రెండు దేశాలు సహకరించుకునే అవకాశం. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో అనేక ద్వైపాక్షిక అంశాల్లో పురోగతి సాధించేందుకు కసరత్తు చేస్తున్నామని జేక్‌ సలీవాన్ పేర్కొన్నారు.