TNPL 2023: ఇదేందయ్యో ఇది.. ఒక బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్! వైరల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bowler and Batter both takes reviews in TNPL 2023: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) 2023లో మంగళవారం ఆసక్తి సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఓ బౌలర్ ఒకే బంతికి 18 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విషయం మరిచిపోకముందే టీఎన్‌పీఎల్ 2023లో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇరు జట్ల ప్లేయర్స్ ఒకే బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్ (Two Reviews In One Ball) తీసుకున్నారు. ఓ డీఆర్‌ఎస్ బ్యాటర్ తీసుకుంటే.. అదే నిర్ణయంపై మరోసారి బౌలర్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. ఇందులో ఓ అంతర్జాతీయ ప్లేయర్ కూడా ఉండడం విశేషం. వివరాల్లోకి వెళితే…
టీఎన్‌పీఎల్ 2023లో భాగంగా బుధవారం కోయంబత్తూరులో దిండిగుల్ డ్రాగన్స్, బా11 ట్రిచ్చి (Ba11sy Trichy vs Dindigul Dragons) మధ్య మ్యచ్ జరిగింది. ట్రిచ్చి ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin DRS) బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ చివరి బంతిని యాష్ క్యారమ్ బాల్ వేయగా క్రీజులో ఉన్న బ్యాటర్ రాజ్‌కుమార్ కవర్స్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి మిస్ అయి కీపర్ చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తగిలినట్లు సౌండ్ రావడంతో.. అశ్విన్ సహా కీపర్ అప్పీల్ చేసారు. దాంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు.
Also Read
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
Adipurush 1st Day Collections: ‘ఆదిపురుష్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. క్రేజ్ మాములుగా లేదుగా!
అంపైర్ నిర్ణయంతో షాక్ అయిన రాజ్‌కుమార్ రివ్యూ కోరాడు. రిప్లేలో స్పైక్ వస్తున్నప్పటికీ.. బంతికి, బ్యాట్‌కు మధ్య గ్యాప్ ఉండడంతో టీవీ అంపైర్ ఎస్ నిశాంత్ నాటౌట్ అని ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించగానే.. ఆర్ అశ్విన్ వెంటనే రెండోసారి డీఆర్‌ఎస్ కోరాడు. ఇది చూసిన ప్లేయర్స్, ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అశ్విన్ ఎందుకు రివ్యూ తీసుకున్నాడో అర్థం కాకా తలలు పట్టుకున్నారు. ఇద్దరు ఫీల్డ్ అంపైర్లతో అశ్విన్ చర్చించాక.. టీవీ అంపైర్ మరోసారి స్పష్టంగా రిప్లై పరిశీలించారు. బంతికి, బ్యాట్‌కు గ్యాప్ ఉండడంతో.. బ్యాట్ గ్రౌండ్‌కు తాకడంతో స్పైక్ వచ్చిందని, నాటౌట్ అని టీవీ అంపైర్ స్పష్టం చేశాడు.
ఇందుకు సంబందించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు, క్రికెట్ ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అదే సమయంలో లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బా11 ట్రిచ్చి 19.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో దిండిగుల్ 14.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు విజయాన్ని అందుకుంది.
2 reviews in one ball, one by batter and one by bowler (Ashwin).
Rarest of incident in world cricket. pic.twitter.com/jB1zZ9qcmw
— Johns. (@CricCrazyJohns) June 14, 2023
తాజావార్తలు
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!