ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ.. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. అంబర్ పేటలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు నీరాజనం పడుతున్నారు.
బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులపై అమ్ముడు పోయారని బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ పనికి మాలినవని ఏనుగులు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతాయని వాటిని పట్టించుకోకూడది మంత్రి తలసాని అన్నారు. మాటెత్తితే జైశ్రీరామ్ అనే మీరు అదే శ్రీరాముడుపై ఒట్టేసి మీరు చేస్తున్న ఆరోపణలు రుజువు చేసుకుంటారా అని సవాల్ చేశారు.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమక్షంలో అంబర్పేట శంకర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజులకు పెద్దపీట వేశారని తెలిపారు. గత ప్రభుత్వాలు ముదిరాజులను విస్మరించారని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముదిరాజులను అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు.
అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు ప్రమాదం తప్పింది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అంబర్ పేట్ నియోజకవర్గం లో శుక్రవారం సీఎం జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.