CI Sudhakar : సీఐ సుధాకర్‌కు బెయిల్ మంజూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూ వివాదం, ఫోర్జరీ కేసులో అంబర్‌పేట ఇన్స్పెక్టర్ పేరం సుధాకర్‌ను వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి అరెస్ట్ తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ శ్రీ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. వనస్థలిపురం పోలీసులు ఈ వారం ప్రారంభంలో ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారుజ ఒక ప్రవాస భారతీయుడు తాను భూ మోసానికి గురైనట్లు ఫిర్యాదు చేశాడు. అతని పిటిషన్ ప్రకారం.. అతను రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామంలో భూమి కొనుగోలు కోసం శ్రీ సుధాకర్‌కు రూ.54 లక్షలు చెల్లించాడు. మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానని నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి సీఐ సుధాకర్ డబ్బులు కొట్టేశారు. పోలీసులు విచారణ జరిపి సుధాకర్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈమేరకు సీఐ సుధాకర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయవూర్తి ఇద్దరు షురిటీలతో 15వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు.
Also Read : Kanti Velugu : కంటి వెలుగు నిర్వహణపై సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్
Also Read
- Pakistan: పాక్‌లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
- Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో 'పే లేటర్' సదుపాయం!
వివరాలు ఇలా..
గతంలో సస్పెండైన ఆర్ఐ రాజేష్‌పై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే కేసు నమోదు చేశారు. కందుకూరు లిమిట్స్‌లోని నేదునూరు గ్రామంలో సర్వేనెంబర్ 54/2 లో ఉన్న పది ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి బి.ఎన్.రెడ్డి ఎస్ కే డి నగర్ కు చెందిన విజయ కుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి 54.5 లక్షల రూపాయలు తీసుకొని నెలలు గడుస్తున్నా ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితులు వనస్థలిపురం పి ఎస్ లో ఫిర్యాదు చేశారు. పలు ఆరోపణలతో సస్పెండైన అర్ ఐ తాను ఎమ్మార్వోనంటూ నకిలీ ఐడి కార్డ్ సృష్టించి త్వరలో ప్రమోషన్ ద్వారా ఆర్డీఓ అవుతానని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నాడు. రాజేశ్ తమ నుంచి తీసుకున్న 54.5 లక్షల రూపాయలను సిఐ సుధాకర్‌కు ఇచ్చినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులకు ఇప్పిస్తానన్న ల్యాండ్.. ఆర్ ఐ రాజేష్ సోదరుడు గతంలోనే కొనుగోలు చేశాడని చెప్పి దానిపై ధరణి పోర్టల్ లోగో తో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ ల్యాండ్ అమ్ముతారంటూ తమ దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఫిర్యాదులో తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
-
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Pakistan: పాక్‌లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Anil Ravipudi: త్రివిక్రమ్‌ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!