సమీకృత కొత్త సచివాలయం ప్రారంభ వేడుకలు ఈ నెల 30న నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల తరువాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. మధ్యాహ్నం 1.20గంటల నుంచి 1.30 గంటల మధ్య యాగం పూర్ణాహుతి కార్యక్రమం ఉండనుంది. తరువాత సమీకృత కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్. ఆ వెంటనే 6వ అంతస్తులోని తన ఛాంబర్లో కొలువుదీరనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 నిమిషాల మధ్యకాలంలో తమతమ ఛాంబర్లలో వివిధ శాఖల మంత్రులు ప్రవేశించనున్నారు. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్ ఉంటుంది. ఆ తరువాత.. గ్యాదరింగ్ ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆ తరవాత తమతమ స్థానాల్లో కొలువుదీరనుంది అధికారగణం, ఇతర ప్రభుత్వ యంత్రాంగం. ఏప్రిల్ 30వ తేదీ నుంచి సమీకృత కొత్త పరిపాలనా సౌధం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆనాటి నుంచి అక్కడే పూర్తిస్థాయి విధులు నిర్వర్తించనున్నారు సీఎం, సీఎంఓ అధికార యంత్రాంగం, మంత్రులు, ఇతర అధికారగణం, సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు.
Also Read : Shahrukh Khan: షారుఖ్ ఖాన్ ఆ విషయాలు తెలుసుకోవాలా!?
ఇదిలా ఉంటే.. ఈ క్రమంలో కొత్త సచివాలయంలోకి అధికారులు శాఖలను తరలించనున్నారు. రేపటితో మొదలై.. ఈ నెల 28 వరకు తరలింపు కొనసాగనున్నది. సచివాలయంలో ఒక్కో ఫ్లోర్‌ను మూడుశాఖలకు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్‌లో హోంశాఖ, రెండో అంతస్తులో ఆర్థికశాఖ, మూడో ఫ్లోర్‌లో వ్యవసాయం, ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖలకు కేటాయించారు. నాలుగో అంతస్తులో నీటిపారుదలశాఖ, న్యాయశాఖలకు, ఐదో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్‌లో సీఎం, సీఎస్‌లకు కేటాయించారు. లోవర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో స్టోర్స్, రికార్డ్ రూమ్‌లు, వివిధ సేవలకు సంబంధించిన ఆఫీసులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Also Read : Off The Record: తెలంగాణతో మళ్లీ వార్తల్లోకి.. జేసీ అదే సేఫ్‌జోన్‌గా భావిస్తున్నారా?