క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు రాబోయే రోజుల్లో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణాడెల్టా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యటిస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడి కి రాజధాని రైతులు తమ గోడు విన్నవించుకున్నారు. అయితే.. తమ సమస్యలు వినాలంటూ అంబటి రాయుడికి రైతుల అభ్యర్థించారు. కానీ.. మరో సారి వింటానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అంబటి రాయుడు. మాకు మద్దతు తెలుపకపోయినా పర్వాలేదు కానీ కనీసం మా సమస్యలు వినాలంటూ వెలగపూడి గ్రామం రైతులు వేడుకున్నారు. అయితే.. స్థానిక వైసీపీ నేతల విజ్జప్తి మేరకు అంబటి రాయుడు అమరావతికి వచ్చారు.
Also Read : Gangs of Godavari: విశ్వక్ సేన్ తదుపరి చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్ ఖరారు
వెలగపూడిలోని వీరభద్రస్వామి దేవాలయానికి అంబటి రాయుడు వెళ్లారు. అయితే.. విషయం తెలుసుకొని అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో సీన్ అంతా ఆసక్తికరంగా మారిపోయింది. అమరావతికి సంఘీభావం తెలుపాల్సిందిగా అంబటి రాయుడును కోరారు. అంబటి రాయుడు ఆడిన ప్రతి మ్యాచ్‌లో సెంచరి కొట్టాలని తామంతా కోరుకున్నామని తెలిపారు. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని కోరారు. జై అమరావతి అనాలని అడిగారు. అమరావతి ఎక్కడికి వెళ్ళదని సమాధానాన్ని అంబటి రాయుడు దాటవేశారు. రైతుల దీక్షా శిబిరానికి రావాల్సిందిగా రాజధాని రైతులు కోరగా.. ఈసారి వచ్చినప్పడు తప్పని సరిగా వస్తానని చెప్పారు.
Also Read : Rohit-Chahal: చహల్‌ను చితకబాదిన రోహిత్.. పక్కనే కోహ్లీ! వీడియో వైరల్