Ambati Rambabu: సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?
- కొట్టివేసిన కేసులు తిరగతోడాలని చూడటం దుర్మార్గం..
- కాపు ప్రజానీకంతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం..
- ఇది అరాచకమైన కార్యక్రమమని గుర్తు చేస్తున్నాం..
- వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2014 – 19 మధ్య కాలంలో జరిగిన తుని రైలు దగ్ధం కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాధం సహా మరో 40 మందిపై అప్పట్లో కేసు నమోదైందని.. ఆ తర్వాత సరైన సాక్ష్యాలు లేకపోవటంతో కోర్టు కొట్టివేసిందని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు.. అప్పటి ఘటనపై తాజాగా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాలనుకుందని చెప్పారు.. సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..? అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లోకి చేరుస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఈ అంశంపై పట్టించుకోవడం లేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలను ముద్రగడ పద్మనాభం నిరసనలకు ఆందోళన చేపట్టారని.. తునిలో భారీ బహిరంగ సభ జరిగిందన్నారు.. సభ తర్వాత రైల్వే ట్రాక్ పై రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తగులబడిందని వెల్లడించారు. రైలును కాపులే తగులబెట్టారని అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు..
READ MORE: Sama Ram Mohan Reddy : దళితుల పేరిట లూటీ.. ఆర్‌ఎస్ ప్రవీణ్‌పై రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వేధించారని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.. అప్పట్లో తాను, దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స వంటి కాపు నేతలు హైదరాబాద్ లో సమావేశమయ్యామన్నారు.. వంగవీటి రంగాను కోల్పోయినట్లు ముద్రగడను కోల్పోకూడదని గట్టిగా తీర్మానించుకున్నట్లు తెలిపారు.. చంద్రబాబు ముద్రగడపై కక్ష్య కట్టి కేసులు పెట్టారని.. నిరసన కార్యక్రమాలపై పెద్ద ఎత్తున కేసులు పెట్టారన్నారు.. జగన్ సీఎం అయిన తర్వాత కాపు ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు మొత్తం తీసివేయించారని చెప్పారు.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసుపై అప్పీలు చేయాలని జీవో ఇచ్చినట్లు తెలిపారు.
READ MORE: CDS Anil Chauhan: మా దాడులు తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది..
కొట్టివేసిన కేసులు తిరగతోడాలని చూడటం దుర్మార్గమని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. “కాపు ప్రజానీకంతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం.. ఇది అరాచకమైన కార్యక్రమమని గుర్తు చేస్తున్నాం.. చంద్రబాబు, హోంమంత్రికి తెలియకుండా ఆ అప్పీలు ఆపివేస్తూ జీవో ఇచ్చారా.. అలా వచ్చి ఉంటే వాళ్ళంత అసమర్ధులు మరొకరు ఉండరు.. ఎందుకు సంతకం పెట్టారు.. ఎందుకు వద్దన్నారు.. చంద్రబాబు బయటకు వచ్చి పొరపాటు జరిగిందని ఒప్పుకోవాలి.. మేము 2వ తేదీ ఇచ్చిన జీవో పొరపాటున వచ్చింది.. కళ్ళు మూసుకున్నామని చెప్పాలి.. తనది డేగ కన్ను అని చెప్పుకునే చంద్రబాబు.. మీకు ఇది కనిపించలేదా.. కాపు సమాజానికి సమాధానం చెప్పాలని చంద్రబాబును కోరుతున్నా.. చంద్రబాబు సమాధానం చెప్పకుంటే మా కార్యాచరణ రూపొందిస్తాం.. నీ ప్రభుత్వంలో జీవో ఎలా వచ్చిందో మీకే తెలియదా.. ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేసే పరిస్థితికి దిగజారిపోయారా.. ఇవన్నీ డ్రామాలు.. లీకులు ఇచ్చి తూచ్ అనాలని చూస్తున్నారు.. అందరూ దొంగలు.. అన్నీ నాటకాలు.. వైసీపీ కాపులపై తీసేసిన కేసులు మళ్లీ పెట్టాలని చూస్తున్నారా.. ఇవాళ టీడీపీలో ఉన్న చాలామంది కాపులు తుని సభకు వచ్చారు.. కాపులను బీసీల్లో చేర్చటం మా సెంటిమెంట్.. ఏ పార్టీలో ఉన్నా కాపులందరితో మాట్లాడతాం.. చంద్రబాబు ఏమైనా చేస్తాడు.. కొట్టేసిన కేసులు మళ్లీ తిరగతోడతాడు.. అడ్డు అదుపు లేని అరాచక పాలన చేస్తుంది.. ట్రిపుల్ ఆర్ వ్యాఖ్యలని పెద్దగా సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు..” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!