విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైసీపీ ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ పార్టీ శ్రేణులకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. విజయం మనదే అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తల్లో ధైర్యాన్ని సీఎం నూరిపోశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. పార్టీ ప్రతినిధుల సభతో గేర్ మారింది.. స్పీడ్ పెరిగింది అని మంత్రి పేర్కొన్నారు. ఇక పాత సైకిల్, కొత్త గ్లాసు కొట్టుకుపోవాల్సిందేనంటూ టీడీపీ, జనసేన పార్టీలపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలను ఆయన చేశారు. అంతేకాదు.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను మంత్రి అంబటి రాంబాబు తన పోస్టుకు ట్యాగ్ చేశారు.
Read Also: Shah Rukh Khan: షారుఖ్ కి వై ప్లస్ భద్రత ఎలా ఉంటుందో తెలుసా?
ఇక, అంతకుముందు.. విజయవాడలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం జరిగింది. నాలుగున్నర ఏళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు సిద్ధం అయ్యారు సీఎం వైఎస్ జగన్.. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అయితే, ప్రతినిధుల సభలో పార్టీ ప్రోటోకాల్ పాటిస్తున్నారు.. వేదికపై పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు మాత్రమే చోటు కల్పించారు.. దీంతో.. వీవీఐపీ గ్యాలరీల్లో ప్రేక్షకుల్లా మంత్రులు బూడి ముత్యాల నాయుడు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కార్మూరి నాగేశ్వరరావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చిండిపోయారు.