Shloka Mehta : అపర కుబేరులు అంబానీలకు ఏదీ ఖరీదైనది కాదు. పుట్టినరోజు పార్టీ చేశారంటే వారి ఖర్చు ఓ పెద్ద కుటుంబం జీవిత పొదుపు అంత ఉంటుంది. వారి బడ్జెట్ ఒకరి మొత్తం జీవిత పొదుపుతో సమానంగా ఉంటుంది. అంబానీ కుటుంబంలో మినీ గెట్ టుగెదర్ జరిగిన ప్రతిసారీ, సెలబ్రిటీలు వారి నివాసంలోకి అడుగుపెట్టిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ఈవెంట్‌లో, అనంత్ అంబానీ యొక్క రూ.18 కోట్ల వాచ్, కాబోయే భార్య రాధిక మర్చంట్ యొక్క చిన్న హీర్మేస్ బ్యాగ్ దాదాపు రూ.2 కోట్ల విలువైనది వేడుకలో సెంటర్ ఆప్ ఎట్రాక్షన్గా నిలిచాయి. వేడుకకు వచ్చి వాళ్లంతా వాటిని చూసి చర్చించుకున్నారు.
Read Also: Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి
ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను కలిగి ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోషరహిత వజ్రాన్ని కలిగి ఉంది. దీని విలువ రూ.450 కోట్లు. నివేదికల ప్రకారం..ఈ నెక్లెస్‌ను లెబనీస్ నగల వ్యాపారి మౌవాద్ రూపొందించారు. శ్లోకా మెహతా పెళ్లి రోజున అంబానీలు ఈ నెక్లెస్‌ని బహుమతిగా ఇచ్చారు. ఇది L’Incomparable అని పిలువబడుతుంది. ఈ నెక్లెస్ లో దాదాపు 200 క్యారెట్ల విలువైన 91 వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఇది సింగిల్ పీస్.. దీని డిజైన్‌ను కాపీ చేయడం కూడా సాధ్యం కాదు.
Behold the most expensive necklace ever created ― The L'Incomparable Diamond Necklace, only made possible by Mouawad. #Mouawad #MouawadDiamondHouse #RareJewels #Diamond #GuinnessWorldRecordhttps://t.co/0dlypdX1MH pic.twitter.com/Zf28a5CWa1
— Mouawad (@mouawad) August 2, 2018