టాలీవుడ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సపోర్టింగ్ యాక్టర్ స్థాయి నుంచి హీరో గా ఎదిగాడు సుహాస్..’కలర్ ఫోటో’ సినిమా తో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు..ఈ సినిమా లో సుహాస్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.. ఈ సినిమా తరువాత సుహాస్ హీరో గా చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.. దీనితో సుహాస్ వరుస గా రెండు విజయాలు సాధించాడు..ఇక ప్రస్తుతం సుహాస్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.తాజాగా సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్. దుశ్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, టీజర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు..విడుదల అయిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్‌డేట్ ను ఇచ్చారు.గుమ్మా అంటూ సాగే ఈ సినిమా లోని ఫస్ట్ సింగిల్ అంబాజీపేట యూనిట్ అక్టోబర్ 30 న విడుదల కానుంది… ఈ విషయాన్ని తెలుపుతూ.. ప్రతి పార్టీలో, ప్రతి జాతరలో మోత మోగించే పాట తెచ్చేస్తున్నాడు మన మల్లిగాడు అంటూ రాసుకోచ్చింది. ఇక ఈ సాంగ్ ప్రోమోను నేడు సాయంత్రం 6:39 గంటలకు విడుదల చేయనున్నారు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నాయి. సుహాస్ మరోవైపు ఆనందరావ్ అడ్వంచర్స్ అనే సినిమా లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది..