Mahesh Babu-Venkatesh Theatre: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న ‘సుదర్శన్’ థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరో సినిమా రిలీజ్ ఉందంటే.. అక్కడ పండుగ వాతావరణం ఉంటుంది. భారీ కటౌట్లు, వందల కొద్ది ఫెక్సీలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి, ఆయన ఫ్యాన్స్‌కి సుదర్శన్ థియేటర్ చాలా సెంటిమెంట్. తన సినిమా మొదటి షోను ఫ్యాన్స్‌తో కలిసి మహేష్ బాబు సుదర్శన్‌లోనే చూస్తారు.…