Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ నుంచి అమరావతికి మరో రాజబాటకు అడుగులు పడుతున్నాయి.. కృష్ణా నదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో , సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. కేవలం రాకపోకలకు మాత్రమే కాకుండా.. అమరావతికి, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలిచేలా ఈ వంతెనను తీర్చిదిద్దాలని భావిస్తోంది ప్రభుత్వం.. 1000 కోట్ల ప్రతిపాదనతో రెడీ అవుతున్న ,ఈ రాజమార్గం ప్రత్యేకత ఏంటి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇప్పటివరకు విజయవాడ నుంచి, అమరావతిలోకి రావాలంటే ,వారధి లేదా, ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధాని ప్రాంతానికి చేరుకోవాలి. పెరుగుతున్న వాహనాలతో, ఈ బ్రిడ్జిలపై ప్రయాణ సమయంలో, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు అయితే కొంత పర్లేదు గాని.. మరొక రెండు మూడు సంవత్సరాలు గడిస్తే , అమరావతిలో పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమైతే, ఈ రెండు బ్రిడ్జిలు మీద రాకపోకల వల్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. వెయ్యి కోట్లతో భారీ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో విజయవాడ నుంచి రాజధాని అమరావతికి రాకపోకలను మరింత సులభతరం చేయడంతో పాటు.. రాజధాని అభివృద్ధిలో ఈ బ్రిడ్జిని కీలక మౌలిక వసతిగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. రాజధాని అవసరాలతో పెరిగిన ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, ఇబ్బందులు తొలగించడంతోపాటు, పర్యాటక ప్రాజెక్టుగా కూడా దీన్ని మార్చాలన్న ఆలోచనతో అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు అని సమాచారం.
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ప్రతిపాదిత సిగ్నేచర్ ఐకానిక్, బ్రిడ్జి ప్రకాశం బ్యారేజీ, రైల్వే బ్రిడ్జిల మధ్య ప్రాంతంలో నిర్మించేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. సీతానగరం ఘాట్ వైపు నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ దిశగా.. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుతో అనుసంధానం కల్పించేలా ప్రాజెక్టును ప్రతిపాదించారు.
అమరావతి అభివృద్ధిలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచేలా డిజైన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే కూచిపూడి నృత్య భంగిమల స్ఫూర్తితో, ఐకానిక్ డిజైన్ రూపొందించే అవకాశంపైనా చర్చ జరుగుతోంది. పర్యాటకంగా కూడా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సమీకరించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఫీజిబిలిటీ రిపోర్ట్, డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. రాజధాని కనెక్టివిటీని పెంచడంతో పాటు.. అమరావతి స్కైలైన్‌లో మరో ప్రత్యేక నిర్మాణంగా ఈ బ్రిడ్జి నిలిచేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తాజావార్తలు
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!