Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు
- మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- గవర్నర్ నిర్ణయం వెలువడే వరకు వేచి ఉండాలని నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సమర్పించిన క్షమాపణను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో తదుపరి చర్యలను నిర్ణయించే ముందు.. మంత్రిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై మధ్యప్రదేశ్ గవర్నర్ నిర్ణయం కోసం వేచి చూడాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అనుచిత వ్యాఖ్యలు
గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి విజయ్ షా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను “ఉగ్రవాదుల సోదరి”గా అభివర్ణించారు. ఉగ్రవాదుల మతానికి చెందిన ఆమెనే.. శత్రువులపైకి మోడీ పంపించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ చేపట్టే అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును సోమవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారించింది. మంత్రిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు గతంలోనే కోరింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ వాదనలు వినిపిస్తూ.. ప్రాసిక్యూషన్ అనుమతిపై గవర్నర్ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.
Also Read
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
మరోవైపు విజయ్ షా తరఫున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ వాదిస్తూ.. మంత్రి ఇప్పటికే తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసి క్షమాపణ చెప్పారని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ.. ఈ విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని సూచించారు.
SIT దర్యాప్తు పూర్తి
ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించిందని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. గవర్నర్ నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు ఏమిటనే దానిపై కూడా ఆయన స్పష్టత కోరారు. ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇస్తే ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తారా? అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అనుమతి లభిస్తే ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని ఏఎస్జీ నటరాజ్ తెలిపారు. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. దీంతో ప్రాసిక్యూషన్ అనుమతిపై గవర్నర్ నిర్ణయం వెలువడే వరకు వేచి ఉండాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
తాజావార్తలు
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
ట్రెండింగ్
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..