Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
- స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం పిటిషన్
- పేద లబ్ధిదారులకు ఇబ్బందులంటూ ఏజీ వాదన
- పిటిషన్ కొట్టివేయాలని ప్రభుత్వ విజ్ఞప్తి
- రేపటికి తదుపరి విచారణ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల అమలుపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) ధర్మాసనంలో కీలక విచారణ జరిగింది. ఈ పథకాల అమలుపై సింగిల్ బెంచ్ గతంలో విధించిన మధ్యంతర స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
విచారణార్హతపై సుదీర్ఘ వాదనలు
అప్పీలు పిటిషన్ విచారణార్హత (Maintainability)పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (AG) వాదనలు వినిపిస్తూ.. పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహాలకు సామాజిక ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయ పథకాలను ఎంతో ప్రయోజనకరంగా అమలు చేస్తోందని కోర్టుకు తెలిపారు.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
పిటిషన్‌ను కొట్టివేయాలని ఏజీ విజ్ఞప్తి
ఈ పథకాల ఆధారంగా జారీ చేసిన జీవోలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే కారణంగా వేలాది మంది పేద లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏజీ పేర్కొన్నారు. పథకాల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన మూల పిటిషన్‌కు ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని, కాబట్టి ఆ పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేయాలని ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం, కల్యాణలక్ష్మి , షాదీముబారక్ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!