Amanchi Swamulu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో చీరాలలో జనసేన పార్టీకి షాక్ తగిలింది.. చీరాల నియోకవర్గ జనసేన సమన్వయకర్తగా ఉన్న ఆమంచి స్వాములు.. ఆ పదవికి రాజీనామా చేశారు.. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు.. అయితే, గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు ఆమంచి స్వాములు.. కానీ, జనసేన అధిష్టానం ఆయనకు చీరాల భాద్యతలు అప్పగించింది.. దీనిపై కినుక వహించిన ఆయన.. ఇప్పుడు చీరాల నియోకవర్గ జనసేన సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు.
Read Also: Odela 2 Firstlook: ‘ఓదెల 2’ నుంచి తమన్నా ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
”నా పై నమ్మకం ఉంచి గతంలో నన్ను చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా నియమించినందుకు ధన్యవాదలు.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా తప్పుకోదలుచుకున్నాను.. దయచేసి నా ఈ అభ్యర్థనను అంగీకరిస్తారని భావిస్తాను” అని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు ఆమంచి శ్రీనివాసులు అలియాస్ ఆమంచి స్వాములు.. అయితే, పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానంటున్నారు. ఆమంచి స్వాములు జనసేన రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్న విషయం విదితమే.
Read Also: Odela 2 Firstlook: ‘ఓదెల 2’ నుంచి తమన్నా ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
కాగా, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడైన ఆమంచి స్వాములు.. గత ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే.. దర్శి, చీరాల, గిద్దలూరు ప్రాంతాలనుంచి ఆమంచి స్వాములు అనుచరులు, అభిమానులు, కాపు సంఘ నేతలు కూడా భారీ సంక్షలో జనసేనలో చేరారు.. చీరాలలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆమంచి కృష్ణ మోహన్.. ఆయన గెలుపులో ఆమంచి స్వాములు కీలక పాత్ర పోషించారని చెబుతుంటారు.