Odela 2 Firstlook: ‘ఓదెల 2’ నుంచి తమన్నా ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah’s Firstlook Out from Odela 2: రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, పూజిత పొన్నాడలు తమ నటనతో ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ‘ఓదెల 2’గా సీక్వెల్ రాబోతుంది.
ఓదెల 2గా వస్తున్న సీక్వెల్‌కు కథ, కథనంతో పాటు నిర్మాతగా కూడా డైరెక్టర్ సంపత్ నంది వ్యవహరిస్తున్నారు. ఈ సీక్వెల్‌ని కూడా అశోక్ తేజనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ మార్చి 1న జరిగింది. రెగ్యులర్ షూటింగ్ కూడా మేకర్స్ ప్రారంభించారు. ఓదెల రైల్వే స్టేషన్‌లో హెబ్బా పటేల్ నటించగా.. ఓదెల 2లో మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నారు. నేడు మహాశివరాత్రి సందర్భంగా తమన్నా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు.
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
Also Read: అండర్19 ప్రపంచకప్ కలిసి ఆడారు.. 100 టెస్ట్ మ్యాచ్ కలిసే ఆడారు! మధ్యలో మరెన్నో
కాశీ గంగా నది తీరాన తమన్నా నడుస్తున్న ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ చేతిలో ఢమరుఖం, మరో చేతిలో దండం పట్టుకుని తమన్నా ఉన్నారు. శివ శక్తిగా ఆమె నటిస్తున్నారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొదటి పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఈసారి థియేటర్లలో పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ సంస్థలపై డి మధు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాంతారా, విరూపాక్ష, మంగళవారం వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన అంజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు.
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!